40 ఇయ‌ర్స్ బాబు ఇగో పై.. ఓ రేంజ్‌లో దెబ్బకోట్టారే..!

Monday, February 11th, 2019, 09:44:22 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై ఆదివారం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. నేటి రాజ‌కీయాల్లో మోస్ట్ వాంటెడ్ సీనియ‌ర్ తానే అని చెప్పుకునే చంద్ర‌బాబు పై ఊహించ‌ని సెటైర్లు వేశారు న‌రేంద్ర‌మోదీ. దీంతో మోదీ తాజా ప‌ర్య‌ట‌న రాష్ట్రానికి ఎలాంటి ఉప‌యోగం లేద‌ని, ఆయ‌న కేవ‌లం చంద్ర‌బాబును తిట్ట‌డానికే గుంటూరు వ‌చ్చారని మోదీ చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే అర్ధ‌మ‌వుతున్నాయి. ఎందుకంటే చంద్ర‌బాబు సీనియారిటీ పైనే టార్గెట్ చేసిన మోదీ బాబు ఇగోను పూర్తిగా దెబ్బ‌తీశారు.

గుంటూరు స‌భ‌లో మోదీ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు త‌న‌కంటే సీనియ‌ర్ అని ఒప్పుకుంటాన‌ని, ఆయ‌న‌కి వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం చేత‌కాద‌ని, కానీ బాబునే సీనియ‌ర్ అని చుర‌కులు అంటించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ తాను, వ‌రుస ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని, అయితే ఎంతో సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబుకు మాత్రం పొత్తుల్లేకుండా గెల‌వ‌డం కూడా చేత‌కాద‌ని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి విజ్ఞ‌త‌తో ప‌ని చేస్తుంటే.. చంద్ర‌బాబు మాత్రం వైసీపీ ప‌న్నిన వ‌ల‌లో చిక్కుకుని గిల‌గిలా కొట్టుకుంటున్నార‌ని, వైసీపీ దెబ్బ‌కి ఏం చేయాలో అర్ధంకాక బీజేపీకి దూరం అయ్యార‌ని చంద్ర‌బాబు ఇగో పై కొట్టారు మోదీ. త‌న ప్ర‌సంగం మొత్తం ఏపీ అభివృద్ది విష‌యంలో పెద్ద‌గా మాట్లాడ‌ని మోదీ చంద్ర‌బాబు పై మాత్రం ఉన్న‌దంతా కక్కేసి ప‌డేశార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.