సూర్య భగవానుడా..అప్పుడే ముసలోడివైపోతున్నావా..!!

Tuesday, January 23rd, 2018, 03:53:43 PM IST

ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడికి ఆరంభం అంతం ఉందా..దీనిగురించి పెద్ద చర్చే జరుగుతోంది. కానీ 460 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఆవిర్భవించడానికి శాస్త్రవేత్తల అంచనా. సూర్యుని శక్తి ఊహాతీతమైనది. నిరంతరం నిప్పులు గక్కుతూ భగభగ మండే అలసట ఆయాసం వంటవి రావా..! ఎన్ని రోజుల పటు సూర్యుడు ఇలా నిప్పులు చిమ్ముతూ ఉంటాడు ? ఇలాంటి సందేహాల్ని నివృత్తి చేసేందుకు శాస్త్ర వేత్తలు వారికి తోచిన విధంగా పరిశోధనలు చేస్తున్నారు.

అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2011 లో బుధగ్రహ కక్ష్యలోకి మెసెంజర్ అనే ఉపగ్రహాన్ని పంపిన సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహం పంపిన కీలకమైన వివరాల ఆధారంగా నాసా శాస్త్ర వేత్తలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సూర్య భగవానుడిలో అప్పుడే వృద్ధాప్య చాయలు మొదలైనట్లు చెబుతున్నారు. వయసు పైబడుతున్న కారణంగా సూర్యుడు తన ద్రవ్య రాశిని, గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. దీని కారణంగా బుధగ్రహ కక్షలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెసెంజర్ ఉపగ్రహం పంపిన వివరాలకు ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ఉపయోగించి బుధగ్రహం కక్ష్యలో మార్పులు వచ్చినట్లు నిర్ధారిస్తున్నారు. దీనిపై మరింతగా పరిశోధనలు జరపడానికి నాసా ఆసక్తి చూపుతోంది.