ఫీల్డర్ల మధ్యలో ఓ కామెంటేటర్.. ఐసిసి మ్యాచ్ లో అద్భుతం!

Friday, June 1st, 2018, 03:52:27 PM IST

దేశవాళీ టోర్నీలకు అలాగే ప్రపంచ స్థాయి క్రికెట్ మ్యాచ్ లకు చాలా తేడా ఉంటుందని అందరికి తెలిసిందే. ఐసిసి నిర్వహించే మ్యాచ్ లో ఎలాంటి మార్పులు కనిపించవు. రూల్స్ కి తగ్గటుగా మ్యాచ్ లు జరుగుతుంటాయి. కానీ మొదటి సారి ఒక మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా ఒకటి జరిగింది. సాధారణంగా ఒక కామెంటేటర్ ఒక స్పెషల్ గదిలో మ్యాచ్ ను చూస్తూ కామెంటరి ఇస్తుంటాడు. కానీ మొదటి సారి ఒక మ్యాచ్ లో ఫీల్డర్ల మధ్యన నిలబడి కామెంటరీ ఇవ్వడం వైరల్ అయ్యింది. గురువారం వరల్డ్‌ ఎలెవన్‌ – వెస్టిండీస్ మధ్య ఛారిటీ టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

క్రికెట్ పెద్ద ఐసిసి ఈ మ్యాచ్ ను నిర్వహించింది. అయితే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ బ్యాటింగ్ చేస్తుండగా నాసిర్‌ హుస్సేన్‌ గ్రౌండ్ లోకి వచ్చి కామెంటరీ ఇచ్చాడు. అది కూడా వికెట్‌ కీపర్, తొలి స్లిప్‌ ఫీల్డర్‌ మధ్య గ్యాప్ లో నిలబడి మ్యాచ్ లో కొత్త మూమెంట్ ను కల్పించాడు. ఐసిసి అధికారికంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో చివరికి వెస్ట్ ఇండీస్ 72 పరుగులతో విజయం సాధించింది.

  •  
  •  
  •  
  •  

Comments