చిన్న వయసులోనే తొలి లైంగిక అనుభవాలు.. షాకింగ్ సర్వే!

Monday, May 28th, 2018, 04:55:26 PM IST

కాలం అనేక మార్పులకు దారి తీస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత రోజుల్లో మనిషి తన సరైన జీవితానికి కొంచెం విరుద్ధంగా నడుస్తున్నాడు అనే తరహాలో ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మనిషి జీవిన విధానంలో లైంగిక కోరికలు చాలా స్పీడ్ జరిగిపోతున్నాయి. ఈ విషయం ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 24 ఏళ్ల లోపే తొలి అనుభవాన్ని పొందుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. మహిళల్లో అయితే 19 ఏళ్ల లోపువారే ఎక్కువ ఉన్నారు.

2015 -16లో ఎన్ఎఫ్ హెచ్ఎస్ (జాతీయ కుటుంబ ఆరోగ్య ) నిర్వహించిన సర్వేలో వివరాలను ఇటీవల విడుదల అయ్యాయి. వివిధ వయసులలోని లక్ష మంది పురుషులపై అలాగే లక్ష మంది మహిళలపై నిర్వహించిన సర్వేల ప్రకారం మహిళలకు 19 ఏళ్ల లోపే పెళ్లి జరుగుతుండడంతో తొలి అనుభవాన్ని ఎక్కువగా పొందుతున్నారు. ఇక మగవారు మాత్రం 24 ఏళ్ల తరువాత లైంగిక అనుభవాన్ని చూస్తున్నారు.

ఇండియాలో ఎక్కువగా 15 నుంచి 19 ఏళ్ల లోపు మహిళలే ఎక్కువగా తొలి రాత్రిలో పాల్గొంటున్నారు. ఎక్కువ శాతం నిజంగా శృంగారంలో పాల్గొంటున్నామని చెప్పిన వారిలో తెలంగాణ కు చెందిన వారు 35% మంది ఉండగా 50% మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. తొలి అనుభవం చుసిన వారు ఎక్కువగా వారి బాయ్ ఫ్రెండ్ /గర్ల్ ఫ్రెండ్ తోనే ఎక్కువ అని తెలిపారు. అందులో పురుషులు ఎక్కువగా ఉండగా ఇతరులతో శృంగారంలో పాల్గొనే వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారట. ఉద్దరాది రాష్ట్రాల్లో కంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం మంది శృంగారంలో పాల్గొంటున్నారని తెలిసింది.

ఇక వయసుల వారీగా తొలి లైంగిక అనుభవాన్ని పొందుతున్న వారి శాతం:

10 నుంచి 14 ఏళ్ల వయసు వారిలో 10% స్త్రీలు – 2% పురుషులు ‘
15 నుంచి 19 ఏళ్ల వయసు వారిలో 57% స్త్రీలు – 25% పురుషులు
20 – 24 ఏళ్ల వయసులో 24% స్త్రీలు – 42% పురుషులు
24 -29 ఏళ్ల వయసు వారిలో 5% స్త్రీలు – 23% పురుషులు
30+ ఏళ్ల పైబడిన స్త్రీలలో 1% మాత్రమే ఉండగా పురుషులు 9% మంది ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments