కేసీఆర్ బయోపిక్ లో నటిస్తాన్తంటూన్న బాలీవుడ్ నటుడు ?

Saturday, September 15th, 2018, 10:48:59 PM IST


అవకాశం వస్తే కేసీఆర్ బయోపిక్ లో నటిస్తానని అంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధికి కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా అయన కేసీఆర్ బయోపిక్ లో నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం పై అయన స్పందిస్తూ కేసీఆర్ బయోపిక్ లో నటించమని ఎవరు నన్ను సంప్రదించలేదని అన్నారు . ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అన్నాడు. తాజాగా అయన ఇండో పాక్ రచయితా సాదత్ హాసన్ మంటో జీవిత కథతో తెరకెక్కుతున్న మంటో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్బంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హైద్రాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ బయోపిక్ గురించి స్పందించాడు నవాజుద్దీన్ సిద్ధికి.

  •  
  •  
  •  
  •  

Comments