ప్రతీకారం తీర్చుకున్న మావోయిస్టులు.. తెలంగాణాలో హై అలెర్ట్!

Tuesday, March 13th, 2018, 04:19:49 PM IST

మావోయిస్టులకు జవాన్లకు మధ్య గత కొంత కాలంగా తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో యుద్దాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే జవాన్లపై మావోయిస్టులు రీసెంట్ గా ప్రతీకారం తీర్చుకున్నారు. ఒక్కసారిగా పరిసర గ్రామాలు భయానికి గురయ్యాయి. సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. మంగళవారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వ్యాన్‌లో గొల్లపల్లి గ్రామం దాటుతుండగా మార్గం మద్యలో సడన్ గా మందుపాతరలు పేలాయి. ఘటనలో 8 సీఆర్‌పీఎఫ్‌ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

మరో ఆరుగురు సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని తడపలగుట్ట అడవిలో జవాన్లకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. అందుకు ప్రతీకారంగా వారు మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఘటన ప్రాంతం మొత్తాన్ని పోలీసులు పర్యవేక్షణలో ఉంచారు.

  •  
  •  
  •  
  •  

Comments