డ్రగ్స్ అమ్మే యువతిగా నటించనున్న నయన్?

Thursday, May 17th, 2018, 11:41:18 PM IST

సౌత్ లో మంచి స్టార్ డం వున్న హీరోయిన్ లలో నయనతార ఒకరు. చంద్రముఖి చిత్రంతో పరిచయమయిన ఆమె ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఏ హీరో పక్కన చేస్తున్నాం, ఎటువంటి పాత్ర అనే విషయం పట్టించుకునే టైపు కాదట ఆమె. చిత్ర కథ, అలానే కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనేకాని ఆమె ఆ చిత్రం ఒప్పుకోదు అనేది ఇండస్ట్రీ వర్గాల వాదన. అటువంటి నయన్ మొన్న ఆ మధ్య కర్తవ్యం, డోరా, మయూరి వంటి పలు హీరోయిన్ ప్రాధాన్యత చింతల్లో నటించి మంచి పేరు సంపాదించింది. కాగా ప్రస్తుతం ఆమె మరొక వైరెటీ పాత్రతో ప్రేక్షకుల మధ్యకు రానున్నట్లు తెలుస్తోంది. అదే కోలమవు కోకిల అనే చిత్రం. ఇందులో ఆమె ఆర్ధికంగా కుటుంబ సమస్యలతో బాధపదే ఒక యువతి, డ్రగ్స్ అమ్ముతూ ఆతర్వాత స్మగ్లింగ్ చేసే స్థాయికి ఎలా మారింది అనేది ఆ చిత్రం కథాంశమట.

ఇందులో ఇతరపత్రాల కంటే ఆమె పాత్రే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృదం చెపుతోంది. ఇదివరకు ఇటువంటి ఛాలెంజింగ్ పాత్రలు ఎన్నో పోషించిన నయనతార మాత్రమే ఇందులో నటించగలదని దర్శకుడు కూడా ఆమెవైపే మొగ్గు చూపింతలు తెలుస్తోంది. యువ సంగీత తరంగం అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇదికాక ఆమె ప్రస్తుతం మరికొన్ని కోలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరా చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే……

  •  
  •  
  •  
  •  

Comments