నయనతార చేతిలో వెయ్యికోట్లు..?

Monday, September 10th, 2018, 09:22:45 PM IST

తమిళ ముద్దు గుమ్మ నయనతార చేతిలో ఇప్పుడు దాదాపు అన్ని చిత్రాలు కలుపుకొని మొత్తంగా 1000 కోట్లు బడ్జెట్ తో వెండి తెర మీదకు రానుంది. తమిళ సినిమాల్లో ఈమెకు ఈమె నటించే చిత్రాలకు ఎంత క్రేజ్ ఉందొ వేరే చెప్పనక్కరలేదు. మొదట్లో సాదా సీదా సినిమాలు చేసినా తర్వాత మాత్రం దశ తిరిగిపోయింది ఒక పక్క గ్లామరస్ చిత్రాలు చేస్తూ తనదైన శైలిలో విభిన్న చిత్రాలు కూడా చేస్తూ వచ్చింది.

కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఈమె కాల్షీట్లు కోసం ఎదురు చూసేవారు. ఆ మధ్య సినిమాలు ఆపేస్తున్నా అని ప్రకటించినా మళ్ళీ సినిమాల మీద మక్కువతో ముఖానికి మేకప్ వేసుకున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరు తో 200 కోట్లు బడ్జెట్, అలాగే తమిళ్ లో శంకర్-కమల్ భారతీయుడు 2 చిత్రం దాదాపు 500 కోట్లు, అజిత్ తో ఒక సినిమా సుమారు 100 కోట్లు ఇలా అన్ని సినిమాలు కలుపుకొని మొత్తంగా దాదాపు 1000 కోట్లు బడ్జెట్ చిత్రాల్లో నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments