నయనతార “అంజలి సిబిఐ” ట్రైలర్ టాక్…

Tuesday, February 12th, 2019, 11:00:03 PM IST

ప్రముఖ అగ్ర కథానాయిక నయనతార నటించిన తాజా చిత్రం అంజలి సిబిఐ. తమిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ ని తెలుగులో ‘అంజలి సి.బి.ఐ’ పేరుతో విడుదల చేయబోతున్నారు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. నయనతార భర్త పాత్రలో విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సిజే జయ కుమార్ నిర్మించారు. హిప్ హాప్ తమిళన్ సంగీతం అందించారు. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మరియు చిత్ర బృందానికి సురేష్ బాబు అభినందనలు తెలిపారు.

‘ఈ లోకంలో జరుగుతున్న ప్రతి మంచికి, చెడుకు.. ప్రతి కదలిక వెనుక ఓ ప్రేమ ఉంది. ఆ ప్రేమ దేనిమీదైనా కలగొచ్చు.. ఐ లవ్‌ కిల్లింగ్‌..’ అంటూ విలన్ పలికే ఈ సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. వాడిని పట్టుకునే పాత్రలో నయనతార అపూర్వమైన నటనను కనబరిచింది. ‘తెలివైన వాడ్ని అనుకుంటున్నాడు.. కానీ కాదు. నేను వాడ్ని త్వరలోనే పట్టుకుంటాను’ అని నయనతార చెప్పడం… ‘బేబీ భయపడకుండా రామ్మా, కొంచెం కూడా నీకు నొప్పి కలగకుండా ఒకేఒక్క బులెట్‌ నీ బుర్రలోకి దించేసి వెళ్లిపోతానమ్మా..’ అంటూ సైకో విలన్ చివర్లో అనడం ఆసక్తికరంగా ఉంది. ఫిబ్రవరి 22 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.