మోడీ దెబ్బకు అప్రమత్తమైన ఇద్దరు అగ్ర హీరోయిన్లు !

Friday, November 25th, 2016, 09:30:33 PM IST

nayan-anushka
అనూహ్యంగా నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో బ్లాక్ మని ఉన్న వారందరిలోను గుబులు మొదలైన విషయం తెలిసిందే. దీనికి సినీ తారలు కూడా భిన్నం కాదని అంటున్నారు. బ్లాక్ మని ఉన్న చాలా మంది దక్షణాది అగ్ర నటులు వారి నల్ల ధనాన్ని వైట్ గా మార్చుకోడం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. తెలుగు తమిళ భాషల్లో అగ్ర కథానాయికలుగా వెలుగొందుతున్న అనుష్క, నయనతారలకు కూడా ఈ ఇబ్బందిలో పడ్డారని తెలుస్తోంది.

తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న వీరు వారి బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునే పనిలో ఉన్నారని తెలుగు తమిళ సినీవర్గాలు అంటున్నాయి. అనుష్క ప్రస్తుతం రూ 2 కోట్లు, నయనతార రూ 3 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఉలిక్కి పడ్డ వీరు తమ పారితోషకాలకు పన్ను కట్టి వైట్ వైట్ మనీ గా మార్చమని నిర్మాతలని కోరుతున్నారట.దీనితో వీరివలన నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తేలుస్తోంది.