షాక్‌ : పుట్టిన‌రోజున మ‌ర‌ణించిన గ‌వ‌ర్న‌ర్‌

Friday, October 19th, 2018, 10:59:32 AM IST

అవిభాజిత ఆంధ్ర ప్ర‌దేశ్‌కి గ‌వ‌ర్నర్‌గా సేవ‌లందించిన గ్రేట్ ప్లాన‌ర్ ఎన్‌.డి తివారీ అస్త‌మించారు. ఈ మ‌ర‌ణం తీర‌ని లోటు అని ప్ర‌స్తుత తెలుగు రాష్ట్రాల‌ గ‌వ‌ర్న‌ర్ ఇ.ఎస్‌.ఎల్‌.న‌ర‌సింహ‌న్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. దేశం ఒక గొప్ప నిపుణుడైన నాయ‌కుడిని కోల్పోయింద‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు.

తివారీ త‌న 93వ పుట్టిన‌రోజున మ‌ర‌ణించ‌డం ఓ పెద్ద షాక్. ఆయ‌న దిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించారు. కాంగ్రెస్ నాయ‌కుడిగా, ముఖ్య‌మంత్రిగా .. గ్రేట్ ప్లాన‌ర్‌గా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న నేత తివారీ. అత‌డి రాజ‌కీయ చాణ‌క్యం అపోజిష‌న్ పార్టీల‌కు ఎంతో గొప్ప‌గా న‌చ్చేది. కాంగ్రెస్ యూత్ లీడ‌ర్‌గా రాజ‌కీయాల్లో ప్ర‌స్థానం ప్రారంభించిన తివారీ అందుకోని ఎత్తులే లేవు. మూడు సార్లు కాంగ్రెస్ త‌ర‌పున ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు. ఇందిరా గాంధీ కేబినెట్‌లో యూపీకి సార‌థ్యం వ‌హించిన గ్రేట్ ప్లాన‌ర్ కం నాయ‌కుడు ఆయ‌న‌.

  •  
  •  
  •  
  •  

Comments