దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్..సంచలన నిర్ణయం దిశగా మోడీ..!

Tuesday, January 30th, 2018, 03:53:36 AM IST

గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. దీనిని ప్రధాన నరేంద్ర మోడీ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. జమిలి పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలనేది మోడీ ఆలోచన. అన్ని రాజకీయ పక్షాలు అంగీకారం తెలిపితే మరో కొన్ని నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలని మోడీ ఉత్సాహంగా ఉన్నట్లు ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ ప్రతిపాదనలో ప్రాథమిక అడుగు పడింది.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పద్ధతి విషయంలో ఎన్డీయే మిత్రపక్షాలు అభిప్రాయం తెలపాలని నరేంద్ర మోడీ కోరినట్లు కేంద్రమంత్రి టీడీపీ నేత సుజనా చౌదరి తెలిపారు. దీనిపై లేఖ రూపంలో చంద్రబాబు నరేంద్ర మోడీకి లేఖ పంపుతారని అన్నారు. ఎన్డీయే పక్షాలన్నీ సమావేశం అయిన నేపథ్యంలో మోడీ ఈ ప్రస్తావన తీసుకునివచ్చారు. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం లోకూడా జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చింది.