ఫైనల్లో భారత్ – శ్రీలంక

Wednesday, July 10th, 2013, 03:45:15 AM IST


ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో వెస్ట్ ఇండీస్ – ఇండియా – శ్రీలంక మధ్య ముక్కోణపు వన్డే సీరీస్ చాలా ఉత్కంఠతని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకూ ఒకే మ్యాచ్ గెలిచిన టీం ఇండియా ఈ మ్యాచ్ బోనస్ పాయింట్ తో గెలిస్తే ఫైనల్స్ కి చేరుకునే అవకాశం ఉంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి గత మ్యాచ్ గెలిచిన ఇండియా అదే ఉత్సాహంతో ఈ రోజు శ్రీలంక తో తలపడుతోంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక బౌలర్స్ తాకిడికి భారత్ బాట్స్ మెన్స్ మొదటి నుంచి నిదానంగా ఆడారు. ఇండియా 29.0 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 119 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. తర్వాత D/L పద్ధతిలో శ్రీలంకకి 26 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శ్రీలంక మొదటి నుంచి ఆచి తూచి ఆడినా ఇండియా బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. శ్రీలంక 24.4 ఓవర్లలో 96 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది .

గురువారం జరిగే ముక్కోణపు సీరీస్ ఫైనల్స్ లో ఇండియా – శ్రీలంక తలపడనున్నాయి.