జీతాలు ఇవ్వలేను.. వేరే జాబ్ వెతుక్కోండి!

Wednesday, February 21st, 2018, 08:23:19 PM IST

రీసెంట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో దాదాపు రూ.11,400కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో దాక్కున్నాడు. అయితే ఆయన కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఇమెయిల్స్ ద్వారా లేఖ పంపించాడు. మొన్నటి వరకు తన దగ్గర ఎంతో కాలంగా పనిచేసిన ఉద్యోగులకు జీతాలను తప్పకుండా ఇస్తానని చెప్పిన నీరవ్ ఇప్పుడు లేఖలో మాత్రం జీతాలు ఇవ్వలేనని చెప్పేశాడు. అందుకు కారణాన్ని కూడా అయన లేఖలో తెలిపారు.

అప్పులు కట్టడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇన్కమ్ టాక్స్ వారు బ్యాంకు ఖాతాలను పనిచేయకుండా సీజ్ చేశారు. కంపెనీ స్టాక్స్ ని కూడా సీజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను జీతాలు ఇవ్వలేను. భవిష్యత్తులో కూడా ఇస్తానో లేదో తెలియదు. వేరే ఉద్యోగాలు వెతుక్కుంటే మంచిదని నీరవ్ మోడీ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కేసుపై ఇంకా అధికారులు విచారణను కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు రూ.5,700కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేశారు. ఇక ఈ కేసులో నీరవ్‌తో పాటు ఆయన మామ ఛోక్సీపై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.