రివ్యూ : నీవెవరో – థ్రిల్లింగ్ బట్ నాట్ ఎంగేజింగ్

Friday, August 24th, 2018, 02:00:10 PM IST

అది పినిశెట్టి హీరోగా ఎంవివి సినిమాస్ పతాకంపై హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన నూతన చిత్రం నీవెవరో. ఈ చిత్రనికి కథ మరియు కథనాన్ని అందించింది కోన వెంకట్. కాగా నేడు విడుదల కానున్న ఈ చిత్రం ప్రీమియర్ షో తాలూకు రివ్యూ ప్రకారం చిత్రం ఎలా ఉందొ చూద్దాం….

కథ:

కథ విషయానికి వస్తే, అంధుడైన కళ్యాణ్ (ఆది పినిశెట్టి) తన చిన్ననాటి స్నేహితురాలు అను(రితిక సింగ్) ని అతి బలవంతం మీద పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అయితే అనుకోకుండా అతని జీవితంలోకి పల్లవి(తాప్సి) ప్రవేశిస్తుంది. మెల్లగా వారిద్దరి మధ్య అనుబంధం మరింత పెరగడంతో, ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అయితే ఒక సక్సెస్ ఫుల్ సర్జరీ తరువాత కళ్యాణ్ కు చూపు వస్తుంది. అనంతరం, అనుకోకుండా పల్లవి కనిపించకపోవడంతో ఆమెను వెతికేపనిలో పడతాడు కళ్యాణ్, ఆలా ఆమె కోసం వెతుకులాట మొదలెట్టిన కళ్యాణ్ కి పల్లవి ఆచూకీ ఎలా తెలుస్తుంది. ఆమె ఎందుకు వున్నట్లుండి ఎందుకు మాయమయింది. చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రితిక సింగ్, తాప్సి వంటి అద్భుత నటులతో కోన రూపొందించిన కథ బాగుంది. వారిని తెరపై వినియోగించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాలో ఆది నిజంగా తన నటన పరంగా అద్భుతంగా నటించి అంధుడి పాత్రకు ప్రాణం పోశాడు. ఇక రితిక సింగ్, మరియు తాప్సి ఇద్దరు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించి ఆకట్టుకున్నారు. అయితేఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు చిత్రం మాములుగా సాగుతూ అంత ఆకట్టుకోదు అనే చెప్పుకోవాలి. ఇక ఇంటర్వెల్ లో ఒక పెద్ద ట్విస్ట్ తరువాత చిత్రం సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇంటర్వెల్ తరువాత వెన్నెల కిశోర్ మరియు ఆదిల మధ్య కామెడీ సీన్స్ చాల ఆకట్టుకుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ వరకు మంచి ఆసక్తితో సాగిన చిత్రం, చివరికి క్లైమాక్స్ ని మూస పద్దతిలో చిత్రీకరించడంతో కొంత నిరాశక్తి కలుగుతుంది. ఇక దర్శకుడు హరినాథ్ సినిమాని చాలావరకు ఆకట్టుకునేలా తీసినా, సెకండ్ హాఫ్ లో మాత్రం ఇంకాస్త దృష్టిపెడితే బాగుండు అనిపిస్తుంది. ఇక కోన వెంట్రకట్ కథ మరియు స్క్రిప్ట్ సినిమాకి బలమైనప్పటికే కొన్ని సన్నివేశాలు తెలిసిపోవడం ఒకరకంగా మైనస్. తీసుకున్న పాయింట్ బాగుంది, ట్విస్ట్ మెయింటెయిన్ చేసినంతవరకు బాగున్నా, ఆ తరువాత అంతగా అలరించదు. ఇక క్లైమాక్స్ తేలిపోవడం వంటివాటిపై మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ లో పరుగెత్తించే కొన్ని సన్నివేశాలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
నటీనటుల అద్భుత నటన

మైనస్ పాయింట్స్:

స్లో ఫస్ట్ హాఫ్
బలహీన సంఘర్షణ పాయింట్
సెకండ్ హాఫ్ లో తేలిపోయే కొంత భాగం
వీక్ క్లైమాక్స్

తీర్పు :

ఈ నీవెవరో సినిమా ఒక మంచి కమర్షియల్ సినిమాకు కావలిసిన మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సహా ఆకట్టుకునే చాల అంశాలు వున్నాయి. ఇక నటీనటులు ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన నటించడం మరొక ఆకర్షణ. స్లో గా సాగె ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కొంత సినిమా మనకు ముందే అర్ధమైనట్లు ఉండడం. ఇక అప్పటివరకు ఎంతో ఆసక్తిగా సాగిన కథా కథనాలు, చివరికి రొటీన్ గా మారడం. పూర్తిగా చప్పగా అనిపించే క్లైమాక్స్ వెరసి, ఒక మంచి త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే ప్రేక్షకుడికి సగం తృప్తిని మాత్రమే ఇస్తుంది ఈ నీవెవరో సినిమా. మొత్తమా చూస్తే ఒక పర్వాలేదనిపించే థ్రిల్లర్ గా ఈ సినిమా నిలుస్తుంది అని చెప్పవచ్చు…

Netiap.com Rating : 2.75/ 5
Reviewed by Netiap Team