రివ్యూ రాజా తీన్‌మార్ : నేల టిక్కెట్టు – టిక్కెట్ కొనడం దండగ

Friday, May 25th, 2018, 03:16:42 PM IST

తెరపై కనిపించిన వారు : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు
కెప్టెన్ ఆఫ్ ‘నేల టిక్కెట్టు’ : కళ్యాణ్ కృష్ణ

మూల కథ :
అనాథ అయిన నేల టిక్కెట్ (రవితేజ) చుట్టూ జనం మధ్యలో మనం అనే తత్వంతో ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతుంటాడు. అలా జనానికి సహాయం చేసే ప్రక్రియలో అతనికి, హోమ్ మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)కి మధ్యన తరచూ గొడవలు జరుగుతుంటాయి.

ఒక దశలో నేల టిక్కెట్ తాను కావాలనే ఆదిత్య భూపతితో గొడవ పెటుకుంటున్నానని అంటాడు. అసలు నేల టిక్కెట్ హోమ్ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు, వారిద్దరికీ మధ్యన సంబంధం ఏమిటి, హోమ్ మంత్రి చేసిన తప్పేమిటి అనేదే మిగతా సినిమా.

విజిల్ పోడు :
→  హీరో రవితేజ తన నటనతో సినిమాను ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి సినిమా మొత్తానికి ప్రేక్షకుల్లకి కొంత ఊరటనిచ్చారు. కాబట్టి ఈ సినిమాకు వేయాల్సిన ఒక్క విజిల్ రవితేజకే వేయాలి.

→  అసలు కథ ఏంటి, హీరో దేని కోసం ఫైట్ చేస్తున్నాడు అనే కీలకమైన అంశం రివీల్ అయ్యే ఇంటెర్వెల్ బ్లాక్ బాగుంది.

→  కథలో అక్కడక్కడా వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ పర్వాలేదనిపించాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
→  దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణ రాసిన కథనం అస్సలు బాలేదు. కథ ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది, అసలు దర్శకుడి గురి ఏ అంశం మీదుంది అనేది అస్సలు బోధపడదు.

→  ఇక సన్నివేశాల విషయానికొస్తే విరామ సన్నివేశం మినహా మిగతావన్నీ నీరసంగా, విసిగించేవిగా ఉన్నాయి.

→  బ్రహ్మానందం, అలీ, సంపత్ లాంటి నటుల్ని వాడుకోలేకపోయిన కళ్యాణ్ క్రిష్ణ ఇంకొన్ని అనవసరమైన పాత్రలకి కథనల్లో చోటిచ్చి మరింత విసిగించగా మధ్యలో వచ్చే పాటలు ఇంకాస్త చికాకు పెట్టాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

→  సినిమా కథనం ఒక దగ్గర మొదలై మధ్యలో అనేక అంశాల మీదికి వ్యక్తుల మీదికి మళ్లడం చూస్తే ఇదేం స్క్రీన్ ప్లే అనే నిరుత్సాహకరమైన ఆశ్చర్యం కలుగక మానదు.

సినిమా చూసినఇద్దరు స్నేహితుల మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : నేల టిక్కెట్టు.. నేల టిక్కెట్టు అంటే ఏంటో అనుకున్నాను.. తల బొప్పి కట్టింది.
మిస్టర్ బి : ఆ కథేంటి, స్క్రీన్ ప్లే ఏంటి, అసలిది కళ్యాణ్ క్రిష్ణ సినిమాయేనా ?
మిస్టర్ ఎ : అవునురా బాబు, నాకు అదే అనుమానం వచ్చింది.
మిస్టర్ బి : టోటల్లీ డిస్సప్పాయింటెడ్. టిక్కెట్ కొనడం దండగ

  •  
  •  
  •  
  •  

Comments