ప్రీమియర్ షో టాక్ : నేల టిక్కెట్టు.. కొత్తగా ఏముంది?

Friday, May 25th, 2018, 10:22:36 AM IST

రాజా ది గ్రేట్ సినిమాతో చాలా కాలం తరువాత బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు అనిపించింది. అయితే ఆ విజయం అలా అందిందో లేదో వెంటనే టచ్ చేసి చూడు సినిమాతో మళ్లీ ఫెయిల్యూర్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ నేల టిక్కెట్టు అనే సినిమాతో వచ్చాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా కామర్శియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఇకపోతే సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో ముందే ప్రదర్శించారు.

సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే.. మాస్ రాజా రవితేజ తన నుంచి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ సినిమాలో కష్టపడిన విధానం బావుంది. కానీ సీన్స్ అంత కొత్తగా ఏమి అనిపించవు. దర్శకుడు తన మార్క్ సినిమాలో అనుకున్నంత స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోయాడనే చెప్పాలి. సినిమా కథ బావున్నా తన నడిపించే విధానంలో తడబడ్డాడు. సందేశాత్మక ఎపిసోడ్స్ రొటీన్ గా అనిపిస్తాయి. కామెడీ సీన్స్ అక్కడక్కడా మెప్పిస్తాయి. పాలిటిక్స్ నేపథ్యంలో కూడా సినిమా కథ సాగుతుంటుంది. హీరో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అందరిని కలుపుకుంటూ వెళ్లడం ఆ కాన్సెప్ట్ బాగానే ఉంది. జగపతి బాబు యాక్టింగ్ అలాగే పోసాని కృష్ణమురళి పృథ్వీ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కొత్తగా అనిపించే సన్నివేశాలు ఏమి ఉండవు. సెకండ్ ఆఫ్ లో మాత్రం పర్లేదు అనే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇక సంగీతం కూడా యావరేజ్ అనే చెప్పాలి. హీరోయిన్ మాళవిక తన క్యారెక్టర్ లో రాణించింది. మొత్తంగా నేల టిక్కెట్టు మాస్ రాజా స్థాయికి తగ్గట్టుగా లేదు అనే టాక్ వస్తోంది. మరి లోకల్ లో ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments