నెల్లూరులో ఆకాశాన్ని తాకుతున్న ఓటు రేటు !

Wednesday, March 20th, 2019, 11:17:39 AM IST

ఈసారి ఎన్నికల్లో అత్యధిక ధర పలకబోయే ఓట్లు కలిగిన నియోజకవర్గాల జాబితాలో నెల్లూరు సిటీ కూడా ఉంది. ఇక్కడి ఓటర్లు ఎప్పటికప్పుడు భిన్నంగా తీర్పునిస్తుంటారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు. ఈసారి కూడా ఆయనే వైకాపా అభ్యర్థి. ఆయనపై పోటీగా మంత్రి నారాయణకు టికెట్ కేటాయించారు చంద్రబాబు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతుండటంతో గెలుపుని ప్రతిష్టామకంగా తీసుకున్నారు నారాయణ.

అన్ని అస్త్రాలతో పాటు ధన బలాన్ని కూడా ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారట. అసలే నెల్లూరు జిల్లా వైకాపా కంచు కోట. అనిల్ కుమార్ కూడా బలంగానే ఉన్నారు. ఇక టీడీపీ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత ఉండనే ఉంది. వీటన్నిటినీ తట్టుకుని గెలుపూని కైవసం చేసుకోవడాకి నారాయణ ఓటును ఎంత ధరైనా పెట్టి కొనుగోలు చెంసేందుకు రెడీ అయ్యారని టాక్. ఓటుకు ఆయన చెల్లించబోయే మొత్తం 6 నుండి 7 వేల వరకు ఉండొచ్చని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ పోరు ప్రధానంగా టీడీపీ, వైకాపాలు నడుమే ఉన్నా జనసేన అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి గెలుపోటములను ప్రభావితం చేయగలడని విశ్లేషకులు భావిస్తున్నారు.