దేశానికి అధ్యక్షుదైనా.. పనివాళ్లు చేసే పని చేశాడు!

Wednesday, June 6th, 2018, 03:26:00 PM IST

సాధారణంగా కాఫీ కింద పడితే పని వాళ్లు క్లీన్ చేస్తారు అని సంపన్నులు వదిలేస్తుంటారు. పెద్ద పెద్ద హోటల్స్ లలో ఇలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోరు. ఇక అధికార హోదాలో ఉండేవాళ్లు కూడా పరిశుభ్రత విషయంలో పెద్దగా పట్టించుకోరు. కానీ రీసెంట్ గా ఓ దేశానికి అధ్యకుడు అయినా ఒక వ్యక్తి ప్రవర్తిన తీరు అందరిని ఆకర్షించింది. కాఫీ పొరపాటున ఒలిపోవడంతో వెంటనే సరిదిద్దుకొని తనంతట తానే దాన్ని శుభ్రం చేశాడు.

నాయకుడు అనే పదానికి అసలైన అర్ధాన్ని ఇచ్చాడు. నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రుటే కు సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆఫీస్ కు వస్తు పొరపాటున చేతిలోఉన్న కాఫీ కప్పు కింద పడిపోయింది. అయితే ఇంతలో కొంత మంది సహా అధికారులు పని వాళ్లను పిలిచారు. కానీ మార్క్‌ వాళ్ల దగ్గర ఉన్న మాప్ సహాయంతో తనే ఫ్లోర్ ను శుభ్రం చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారందరు మార్క్ చేసిన పనికి చప్పట్లు కొట్టారు. నిజమైన నాయకుడికి అసలైన అర్ధాన్ని చూపించారు అని ప్రతి ఒక్కరు ఆ దేశాధినేతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments