నిన్నటి మ్యాచ్ ఓటమిపై ముంబై జట్టుని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Wednesday, April 25th, 2018, 05:25:39 PM IST

పొట్టి ఓవర్ ల క్రికెట్ ఐపీఎల్ వచ్చాక క్రికెట్ రూపు రేఖలే మారిపోయాయి అని చెప్పాలి. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లు , 50 ఓవర్ ల వన్డే క్రికెట్ మ్యాచ్ ల లా కాకుండా కేవలం 20 ఓవర్ లు మాత్రమే కలిగి ఉండడం ఐపీఎల్ ప్రత్యేకత అని అందరికి తెలిసిందే. అంతే కాదు ఐపీఎల్ చూసే ప్రతిఒక్కరు ఏ జట్టు అత్యధిక పరుగులు చేస్తుందా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి తక్కువ స్కోర్ చేసి తొలి బాటింగ్ జట్టు నిష్క్రమిస్తే, మలి బాటింగ్ కి వచ్చిన జట్టు చాలా వరకు ఆ స్కోర్ ని బీట్ చేసిన సందర్భాలు చాలా చూశాము. అయితే నిన్న జరిగిన ముంబై, హైదరాబాద్ మాక్ మాత్రం ఐపీఎల్ అన్ని సీజన్ ల లో అత్యంత పేలవమైన మ్యాచ్ గా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

తొలుత బాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవెన్లకు 118 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అందరూ ముంబై ఇండియన్స్ చాలా సునాయాసంగా ఆ స్కోర్ ని చదిస్తారు అనుకున్నారు. అయితే ముంబై జట్టులో ఒక్కరొక్కరుగా పెవిలియన్ బాట పట్టడంతో చివరికి ముంబై జట్టు 18.5 ఓవెన్లకు 10 వికెట్లు కోల్పోయి కేవలం 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే సూర్య కుమార్ యదవ్, క్రునల్ పాండ్య తప్పించి జట్టులో మరెవ్వరు రెండంకెల స్కోర్ కూడా సాధించలేకపోవడం. ఇదివరకెప్పుడు మరీ ఇంత చెత్త పేలవమైన ఆట ప్రదర్శన చూడలేదని, ఈ మ్యాచ్ పై మీడియా లో తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తూ ముంబై జట్టు సభ్యులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆ ట్రోల్స్ లో కొన్ని మీకోసం సరదాకి…..

  •  
  •  
  •  
  •  

Comments