అనుష్క.. ముందు ని భర్తని కంట్రోల్ లో పెట్టుకో!

Tuesday, June 19th, 2018, 12:10:39 AM IST

ఇటీవల బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అయిన అనుష్క శర్మ ఓ వ్యక్తికి గట్టిగా చివాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి కారులో వెళుతూ ప్లాస్టిక్ చెత్తను రోడ్డుపై పడేశారు. దానికి అటుగా వెళుతున్న అనుష్క శర్మ అది చూసి ఆ వ్యక్తిపై గట్టిగా అరిచేసింది. డస్ట్ బిన్ వాడటం నేర్చుకోండి అంటూ కేకలు వేసింది. ఆ ఘటనను విరాట్ వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ ఘటనపై పలువురు భిన్నాభిప్రాయాలు తెలుపడం వైరల్ అయ్యింది. ముందు ని భర్తని కంట్రోల్ లో పెట్టుకో అనుష్కా.. గ్రౌండ్ లో ఊరికే నోరు పారేసుకుంటాడు అని వివిధ ఉదాహారణలతో నెటిజన్స్ కామెంట్ చేశారు. అలాగే మరికొంత మంది నీతులు ఎవరికీ చెబుతున్నారని అన్నారు. పుట్టిన రోజులకు బర్త్ డే కేకులను మొహానికి పూసుకొని వేస్ట్ చేస్తారు. ఆకలితో ఎంత మంది చిన్నారులు ఉన్నారో తెలుసా? ఈ సారి కేక్ బదులు ఆవు పేడ పూసుకోండని చెప్పారు. అలాగే బూతులు మాట్లాడినప్పుడు కెమెరాను స్లో మోషన్ లో పెట్టొద్దు అంటారా? అప్పుడు మీ సంస్కారం ఏమయ్యింది?. ఆ వ్యక్తి కి సున్నితంగా చెప్పాల్సింది. అలా చేయకుండా అతన్ని తిట్టి దాన్ని వీడియో తీసి. అతని వివరాలు షేర్ చేయడం వంటి డ్రామాలు ఎందుకని పలువురు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.