శరం ఉందా?.. రాహుల్ పై ఫ్యాన్స్ ఆగ్రహం!

Tuesday, September 4th, 2018, 12:54:19 PM IST

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ లో గెలుస్తుందని అనుకున్న టీమిండియా ఓడిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా ఫ్యాన్స్ ను బాదిస్తోన్న విషయం ఏమిటంటే.. క్రికెటర్లు ఇతర పనులపై పెట్టిన ఏకాగ్రత ఆటపై పెట్టడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ కెఎల్.రాహుల్ పై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు. మనోడు గత 13 ఇన్నింగ్స్ లలో చేసిన స్కోరును ట్విట్టర్ లో పోస్ట్ చేసి సెటైర్ వేస్తున్నారు.

ఇటీవల ఇషాంత్ శర్మా పుట్టినరోజు సందర్బంగా అతనికి శుభాంక్షలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశాడు. అయితే అదే రోజు ఇండియా నాలుగవ టెస్ట్ ఓడింది. దీంతో ఆ ట్విట్ కు అభిమానులు పెద్ద ఎత్తున సమాధానం ఇచ్చారు. ఆటపై కాస్త ద్రుష్టి పెట్టు అంటూ నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేశారు. మరొకవ్యక్తి అయితే సిగ్గులేదు శరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు పాండ్యపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు
వెలువడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments