పాకిస్తాన్ పై ఎందుకంత ప్రేమ?..కైఫ్ పై నెటిజన్స్ కామెంట్స్!

Monday, July 9th, 2018, 05:25:11 PM IST

ఇటీవల జింబాబ్వే లో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ లో పాకిస్థాన్ ఆసీస్ పై అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో పాకిస్థాన్ గెలుపుపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ లో ఓపెనర్‌ ఫఖర్‌ జ మాన్‌ ఆట అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. 46 బంతుల్లో 91; 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో రెచ్చిపోయాడు. అయితే అతని ఆట తీరుకు ఫిదా అయిన భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ప్రశంసలతో ముంచెత్తాడు.

ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమ్ అద్భుత విజయం సాధించిందని గ్రేట్‌ ఇన్నింగ్స్‌తో ఫఖర్‌ జమాన్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడని బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌.. కంగ్రాచ్యులేషన్స్‌’ అంటూ కైఫ్‌ సోషల్ మీడియాలో ట్వీట్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు వివాదస్పదంగా కామెంట్స్ చేస్తుండడం వైరల్ అయ్యింది. ‘దేశద్రోహి’ అంటూ కైఫ్‌పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారు. ‘పాకిస్తాన్‌ విజయం సాధిస్తే మ సంతోషపడతారా‘… ‘పాకిస్తాన్‌పై ఎంత ప్రేమ ఉందొ.. అక్కడే ఉండొచ్చుగా’ అంటూ వరుసగా ట్వీట్స్ వస్తుండడంతో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments