సోషల్ మీడియాలో లోకేష్ ను ఆడుకుంటున్నారుగా.!

Monday, February 11th, 2019, 11:37:04 PM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజానీకం ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.ఈ రోజు ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తెలుగుదేశం పార్టీ నేతలంతా ముఖ్యమంత్రితో సహా నల్ల దుస్తులు ధరించి వారి నిరసననను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే అక్కడ వారు చేస్తున్నటువంటి దీక్షకు సంబందించిన ఫోటోలను నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చెయ్యగా ఎప్పుడు లేని విధంగా లోకేష్ కు ఇతర పార్టీ అభిమానులు సామాన్య ప్రజలు లోకేష్ అదిరిపోయే రిప్లైలు ఇస్తున్నారు.

ఈ మీటింగు కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి 200 ఫ్లైట్ టిక్కెట్లు వేసి,మళ్ళీ అక్కడ 3500 ఏసీ రూములు ఎందుకు బుక్ చేసుకున్నారు అని వాటికి మీరు ఖర్చు పెడుతున్న ప్రతీ రూపాయి మాదే కదాని ప్రశ్నిస్తున్నారు,అలాగే మరికొంత మంది అది ఏదో కుటుంబ విహారయాయాత్రలా ఉంది కానీ నిరసనలా ఎక్కడా కనిపించట్లేదు అని కామెంట్లు చేస్తున్నారు,అలాగే ఒక ఫోటోని పెట్టి చాలా కష్టపడుతున్నారు,హోదా కోసం కాదు సెల్ఫీ కోసం అంటూ చురకలు అంటిస్తూ,ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబు కాదా అంటూ లోకేష్ కు చుక్కలు చూపించారు.