తెలుగుదేశం నేతలకు విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి అంటూ..నెట్టింట్లో ట్రోల్ల్స్..!

Thursday, October 25th, 2018, 09:00:38 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ నేతలకు ఈ మధ్య పబ్లిసిటీ పిచ్చి బాగా ఎక్కువయ్యిపోయిందని,ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.వారి అధికారంలో ఎన్నో విజయాలు సాధించి ఉండొచ్చు, లేకపోవచ్చు అలాగే వారు చేపట్టిన సహాయక చర్యలు పూర్తికాక ముందే సమస్యల మీద వాటి మీద విజయం మేము సాధించేసాం అని ఇలా ప్రచారాలు చేసుకోవడం ఏమిటని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నేతల యొక్క చర్యలను ట్రోల్ చేస్తున్నారు.దీనికి గల బలమైన కారణాలు కూడా లేకపోలేవు..ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలోని తిత్లి తుఫాను ప్రభావం వల్ల అక్కడ ఎంత నష్టం వాటిళ్లిందో అందరికి తెలుసు,అధికారంలో ఉన్నారు కాబట్టి ముందుగానే టీడీపీ ప్రభుత్వం స్పందించి అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.

ఈ సహాయక చర్యలు అక్కడ క్షేత్ర స్థాయిలో జరిగాయా అంటే అది కూడా లేదు అన్న మాట కూడా వాస్తవమే మరి కొంత మంది అయితే కేవలం సెల్ఫీల కోసం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు అని సిక్కోలు వాసులు కూడా చెప్పారు.అక్కడ ప్రజలు అన్ని ఇబ్బందులు,అవస్థలు పడుతుంటే అవేవి వీరికి కనిపించడం లేదు కానీ,ఆ సమస్యల మీద మేము విజయం సాధించేసాం అంటూ తెలుగు తమ్ముళ్లు బైక్ ర్యాలీలు,పెద్ద పెద్ద ఫ్లెక్సీ హోర్డింగులూ..బస్సుల మీద పోస్టర్లతో ప్రచారాలు చేసుకుంటున్నారు అని సోషల్ మీడియాలో ఎందుకు టీడీపీ నేతలు ఇంత పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది అని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.ముందు ప్రజల సమస్యలను తీర్చండి ఆ తర్వాత మీకు నచ్చిన కార్యక్రమాలు చేసుకోండి అని సూచిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments