జీఎస్టీ, డిజిట‌ల్ స‌మ‌స్యలపై ప్రెసిడెంట్ హామీ

Sunday, July 29th, 2018, 01:25:04 AM IST

డిస్ట్రిబ్యూట‌ర్ సెక్టార్‌, నిర్మాత‌ల సెక్టార్‌, స్టూడియోస్ సెక్టార్‌, ఎగ్జిబిట‌ర్ సెక్టార్ అనే నాలుగు సెక్టార్లు ఫిలింఛాంబ‌ర్‌లో భాగంగా ఉంటాయి. ఈ నాలుగు విభాగాలు ట్రేడ్‌కి ఎంతో ఇంపార్టెంట్‌. వీళ్ల‌కు ఏ స‌మ‌స్య‌లు వ‌చ్చినా చాంబ‌ర్ ప‌రిశీలించి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఎన్నికైన ఫిలింఛాంబ‌ర్ కొత్త అధ్య‌క్షుడు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌దైన శైలిలో హామీలిచ్చారు.

కొత్త ప్రెసిడెంట్ వీరినాయుడు మాట్లాడుతూ-“ఎగ్జిక్యూటివ్ క‌మిటీలో స‌భ్యునిగా ప‌రిశ్ర‌మ అన్ని సెక్టార్ల స‌మ‌స్య‌ల గురించి తెలుసు. ఎగ్జిబిట‌ర్ల‌కు జీఎస్టీ స‌హా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు ఉన్నాయి. ధ‌ర‌ల‌న్నీ తారా స్థాయిలో ఉన్నాయి. వీట‌న్నిటినీ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ‌తాం. ఏపీ, తెలంగాణ రెండుచోట్లా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారం క‌నుగొంటాం. మాటీమ్‌తో క‌లిసి అంద‌కు కృషి చేస్తాను. అలానే డిజిట‌ల్‌లో స‌మ‌స్య‌లున్నాయి. డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల త‌ర‌పు నుంచి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తాను. కొంద‌రు డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు మ‌మ్మ‌ల్ని క‌లుస్తున్నారు. వాళ్లు ఇచ్చే సాంకేతిక‌త‌లో క్వాలిటీ ఎలా ఉందో ప‌రిశీలిస్తాం. ఈ సీజ‌న్‌లో మంచి ప‌నులు చేస్తాను“ అని అన్నారు. మొత్తానికి జీఎస్టీ, డిజిట‌ల్ స‌మ‌స్య‌ల్ని వేగంగా ప‌రిష్క‌రించాల‌ని అంతా కోరుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌పై కొత్త అధ్య‌క్షుడు స్ప‌ష్ట‌మైన హామీల్ని ఇవ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments