వెంకన్న సన్నిధిలో మరో వివాదం.. ప్రధానార్చకుడి హోదా కోసం పోటీ!

Friday, May 25th, 2018, 12:10:07 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొంత కాలంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయాల వరకు ప్రధానార్చకుడి రమణ దీక్షితుల వ్యవహారం వెళ్లింది. దేశం మొత్తంగా ఆ న్యూస్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానార్చకుడి రమణ దీక్షితులను తొలగించగా వివాదం ఇంకా ఎంత మాత్రం ఓ కొలిక్కి రాలేదు. చర్చలు కూడా సరిగ్గా జరుగక ముందే మరో కొత్త వివాదం సంచలనం సృష్టిస్తోంది.

స్వామి వారికి ప్రాధాన అర్చకులుగా వేరే వారిని నియమిస్తే ఎంత మాత్రం ఒప్పుకోమనని తామే నియమించాలని గొల్లపల్లి, తిరుపతమ్మ వంశీయులు పోరాటం చేయడానికి సిద్దపడుతున్నారు. అసలే మిరాశీ వ్యవస్థను రద్దు చేయడంతో మా కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అందువల్ల తమ కుటుంబ సభ్యుల లోని సీనియర్ అర్చకులకు అవకాశం ఇవ్వాలని రమణ దీక్షితుల తరువాత మా కంటే సీనియర్లు ఎవరు లేరని కుడా చెబుతున్నారు. రీసెంట్ గా ఆ హోదా కోసం ఈఓకు లేఖలు రాశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉన్నతాధికారులు ఇంకా ఎలాంటి వివరణను ఇవ్వలేదు.

  •  
  •  
  •  
  •  

Comments