“భాగ్య నగరం లో విద్యుత్ బస్సులు”..!

Thursday, September 6th, 2018, 01:00:08 AM IST

ప్రస్తుతం మారుతున్న కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. ఆధునిక సాంకేతికత ఎంత గానో అభివృద్ధి చెందిందో మనం ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఐతే మారుతున్న,అభివృద్ధి చెందుతున్న కొద్దీ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన కనీస భాద్యత మనపై ఉంది. పెరుగుతున్న సాంకేతికతతో పాటు కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా మోటారు వాహనాలు నుంచి వచ్చే పొగ మూలంగా విపరీతమైన వాయు కాలుష్యం పెరిగిపోతుంది.

భాగ్య నగరం లో ఉన్న ట్రాఫిక్ లో ఐతే ఇక చెప్పనక్కరలేదు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం తో వాటి నుంచి వచ్చే పొగ మూలంగా తోటి ప్రయాణీకులుతో పాటు పర్యావరణం కూడా పాడవుతుంది. దీని దృష్టి లోకి తీసుకొని తెలంగాణా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది.ఎలక్ట్రిక్ బస్సుల ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్ర తో తెలంగాణ పురపాలక కార్యదర్శి అరవింద కుమార్ నేతృత్వం లో దాదాపు 40 “విద్యుత్ బస్సులను” ఆర్టీసీ కి అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కొంత అయినా తగ్గించవచ్చు అని ముందుగా ఈ బస్సులను శంషాబాద్ విమానాశ్రయం వైపుగా నడుపుతారని తెలియజేసారు.

  •  
  •  
  •  
  •  

Comments