ఫేస్ బుక్ లో సరికొత్త ఫీచర్!

Wednesday, April 18th, 2018, 10:06:43 PM IST


నేడు ఫేస్‌బుక్ ఒక సరికొత్త ఆప్షన్‌తో ముందుకొచ్చేసింది. తమ ఖాతాదారులు ఫేస్‌బుక్‌ను ఎంజాయ్ చేస్తూనే, అదే సమయంలో మొబైల్‌ను రీచార్జ్ చేసుకునేలా సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ఐఫోన్ యూజర్లు కొంతకాలం ఆగక తప్పదు. ఫేస్‌బుక్ సొంతమైన వాట్సాప్ ఇటీవల పేమెంట్ సేవలను అందుబాటులోకి తీసుకొచైనా విషయం తెలిసిందే. ఈ రంగంలో పేటీఎం, ఫ్రీచార్జ్, మొబీక్విక్‌లు దూసుకెళ్తుండడంతో వాటిని ఎదుర్కొనేందుకు ఈ సేవలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా రీచార్జ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందుకోసం యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి కొత్త ఫేస్‌బుక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీచార్జ్ ఆప్షన్ కోసం యూజర్లు నోటిఫికేషన్ ఐకాన్ పక్కనున్న హంబర్గర్ ఐకాన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని వెర్షన్స్‌లో మొబైల్ టాప్-అప్ అని కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రెండు ఆప్షన్లు కనిపించకుంటే సీ మోర్ ఆప్షన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత ఫేస్‌బుక్ యాప్ ఓ వెల్కమ్ స్క్రీన్‌ను చూపిస్తుంది. ఫేస్‌బుక్ ఖాతాలో అప్పటికే యూజర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు యాడ్ చేసుకుని ఉంటే వాటిని చూపిస్తుంది.

ఆ తర్వాత మొబైల్ నంబరును ఎంటర్ చేస్తే, ఆటోమెటిక్‌గా ఆపరేటర్ ఎవరో చెప్పేస్తుంది. లేదంటే ‘సెలక్ట్ ఆపరేటర్’ ద్వారా కూడా ఆపరేటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత రీచార్జ్ మొత్తాన్ని ఎంటర్ చేయాలి. అవసరం అనుకుంటే ప్లాన్లను తెలుసుకునేందుకు ‘బ్రౌజ్ ప్లాన్స్’ ఆప్షన్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఈ రీచార్జ్ ఆప్షన్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ విధానాల ద్వారా రీచార్జ్ చేసుకునే వెసులుబాటు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరుకూడా పేస్ బుక్ లేటెస్ట్ వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకుని పాయమెంట్స్ ఆప్షన్ ను వినియోగించుకోండి…..

  •  
  •  
  •  
  •  

Comments