కొత్త రంగుల్లో ఐ ఫోన్ 8, 8 ప్లస్ అండ్ ఐ ఫోన్ X

Monday, March 26th, 2018, 05:00:44 PM IST

యాపిల్ ఫోన్ కొనడం అంటే కొందరి కల, అన్ని రాకాల మొబైల్ ఫోన్ కంపనీలతో పోటీ పడుతూ కూడా యాపిల్ దే అగ్రస్థానం. ఇప్పుడు యాపిల్ తన ఐఫోన్ X కు గాను నూతన కలర్ వేరియెంట్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఐఫోన్ 10 ఇప్పటికే స్పేస్ గ్రే, సిల్వర్ రంగుల్లో వినియోగాదారులకు లభిస్తుండగా త్వరలో బ్లష్ గోల్డ్ రంగులో లభ్యం కానున్నట్లు సమాచారం. ఇందుకు గాను ఇప్పటికే ఈ కలర్ వేరియెంట్ ఐఫోన్ 10 ఫోన్‌ను యాపిల్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఐఫోన్ 8, 8 ప్లస్‌లను నూతనంగా రెడ్ కలర్ వేరియెంట్లలో లాంచ్ చేయనున్నారు. ఐఫోన్ 10ను కూడా రెడ్ కలర్ వేరియెంట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ ఫోన్లకు గాను సేల్స్ అంతంత మాత్రంగానే ఉండడంతో కనీసం నూతన కలర్ వేరియెంట్లను విడుదల చేస్తేనైనా సేల్స్ పెంచుకోవచ్చని యాపిల్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకనే కొత్త కలర్ వేరియెంట్లను త్వరలో యాపిల్ విడుదల చేస్తుందని తెలుస్తున్నది. ఇక కొత్త వేరియంట్ కలర్ ఫోన్లు ఎంత సేల్స్ తెచ్చిపెదతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments