పీసీసీ నూతన కార్యవర్గం ఖరారు

Monday, June 10th, 2013, 12:07:37 PM IST


పీసీసీ నూతన కార్యవర్గం ఖరారైంది. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన కార్యవర్గంలో 13 మంది ఉపాధ్యక్షులు, 17 మంది ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులతో పీసీసీ కార్యవర్గాన్ని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పీసీసీకార్యవర్గంలో రెండో జాబితాని త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రస్తతం ప్రకటించని మిగిలిన కేటగిరీల పేర్లు అందులో ఉంటాయని వివరించారు.

నూతన కార్యవర్గంలో నలుగురు ఎస్సీలకు, ఒక ఎస్టీకి, నలుగురు క్రిస్టియన్ మైనారిటీలకు, పది మంది బీసీలకు, 11 మంది ఓసీలకు చోటు కల్పించారు. ఉపాధ్యక్షులుగా నంది ఎల్లయ్య, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ఆమోస్, వంగా గీత, శివరామిరెడ్డి, శారద, రెడ్యానాయక్, చెంగల్రాయుడు, గంగాధరం, నాగయ్య, దొరై స్వామి, నరసింహారెడ్డి లను నియమించారు.

ప్రధాన కార్యదర్శులుగా బూరగడ్డ వేద వ్యాస్, కేవీ నాగేశ్వర్రావు, తిప్పేస్వామి, గిడుగు రుద్రరాజు, సుధాకర్ బాబు, జగన్నాథ శ్రీనివాస్, హరి రామదేవి, లక్ష్మణ కుమార్, కే దామోదర్, టి కుమార రావు, పల్లి లక్ష్మణ్ గౌడ్, పులు జనార్థన్, రత్నబిందు, ఆర్. రెడ్డప్ప రెడ్డి, రెహ్మన్, కుసుమ కుమార్, ఫరీదుద్దీన్ లను నియమించారు. త్వరలో నూతన కార్యవర్గ సమావేశం జరుగుతుందని బొత్స చెప్పారు.