టిఆర్ఎస్ కు తలపోటుగా మారిన రెడ్డి పోరు !

Friday, October 13th, 2017, 11:42:11 AM IST

రెడ్డి సామజిక వర్గానికి కేసీఆర్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి లోలోన దాగుంది. గురువారం జరిగిన రెడ్డి పోరు యాత్రలో భాగంగా అది బయట పడింది. రెడ్డి సామజిక వర్గం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టిఆర్ ఎస్ ప్రభుత్వంపై ఉన్న సంతృప్తితో రెడ్లు అంతా ఏకమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని పసిగట్టి రెడ్ల ఉద్యమాన్ని ఆదిలోనే అణచివేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనితో పాటుగా వెలమ, కమ్మ సామజిక వర్గాలని కలుపుకుని టిఆర్ ఎస్ ని తిరుగులేని శక్తిగా చేసేందుకు టిఆర్ ఎస్ అధినేత పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అకస్మాత్తుగా తెలంగాణాలో జరుగుతున్న రెడ్డి పోరు యాత్ర గురుంచి అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే ఈ ఉద్యమం తెరపైకి వచ్చిందనే వాదనని అధికార పార్టీ వ్యక్తపరుస్తోంది. నేరుగా ఉద్యమం చేయకుండా వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలనీ, నిరుపేద రెడ్డిలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు పేరుతో ఉద్యయం చేస్తున్నారు. గురువారం కొంపల్లి వద్ద జరిగిన రెడ్డి పోరు యాత్ర ని పోలీస్ లు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీస్ లు మరియు ప్రభుత్వ చర్యలతో ఆగ్రహానికి గురైన ఉద్యమకారులు రోడ్లపై భైఠాయించారు. దీనితో బోయిన్ పల్లి నుంచి తూప్రాన్ వరకు 40 కిమీ మేర ట్రాఫిక్ స్థంభించిపోయింది. కాంగ్రెస్ పార్టీ లో రెడ్డి సామజిక వర్గం ఎక్కువగానే ఉంది. దీనితో ఈ ఉద్యమానికి వారి మద్దత్తు ఖచ్చింతగా ఉంటుంది. ఈ నయా పొలిటికల్ ఎత్తుగడనే కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments