న్యూజిలాండ్ కి షాక్ ఇచ్చిన ఆఫ్ఘన్.. న్యూ రికార్డ్

Thursday, January 25th, 2018, 12:36:40 PM IST

గత కొన్నేళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌ అనే దేశం ఎవరికీ అంతగా తెలియదు. ఉగ్ర ఆనవాళ్లతో సతమతమయ్యే ఆ దేశం గుర్తింపు దిశగా అడుగులు అంతగా వేయలేదు. ముఖ్యంగా క్రీడల్లో ఆ దేశం వెందుకంజలో ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ యువ కెరటాలు క్రికెట్ లో సత్త చాటుతున్నారు. అఫ్గానిస్థాన్‌ క్రికెట్ లో ఇప్పుడు కీలక ఆటగాళ్లు అందరిని ఆకర్షిస్తున్నారు. ఐపీఎల్ బిగ్ బ్యాష్ లాంటి ప్రయివేట్ లీగ్స్ లో కూడా రాణిస్తున్నారు. అయితే వారితో పాటు అండర్ 19 జట్టులో ఉన్న యువకులు కూడా సత్తా చాటుతున్నారు.

ప్రస్తుతం అండర్ 19ప్రపంచ కప్ లో ఆడుతోన్న వారు మంచి ప్రదర్శనతో జట్టుకు విజయాలను అందిస్తున్నారు. అయితే ఆతిధ్య జట్టు న్యూజిలాండ్ పై పంజా విసిరి రికార్డ్ సృస్టించారు. 202 పరుగులతో విజయం సాధించి మంచి విజయం అందుకున్నారు. క్వార్టర్‌ ఫైనల్లో అఫ్గానిస్థాన్‌ మొదటి ఇన్నింగ్స్ లో 50 ఓవర్లలో 309 పరుగులు చేసింది. గుర్బాజ్(69), జర్డాన్‌(68) మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో చివరి ఓవర్లలో అజ్మతుల్లా 66 (23 బంతుల్లో) పరుగులు రాబట్టుకోవడంతో స్కోర్ 310కి చేరింది. అనంతరం భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన కివీస్ 28.1ఓవర్లలో కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో అఫ్గానిస్థాన్‌ 202 పరుగుల తేడాతో విజయం సాధించి సెమిస్ కు చేరుకుంది.