రాఫెల్ కుంభకోణం.. మోడీ ఎంత మాయ చేసావయ్యా !

Friday, February 8th, 2019, 10:23:09 AM IST

దేశ ప్రధాని అంటే పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరించాలి. చేసే ప్రతి పని రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించేలా ఉండాలి. పైకి నరేంద్ర మోడీ పై లక్షణాలు ఉన్నట్టే కనిపిస్తారు కానీ తేరా వెనుక చేసే పనులు చేసేస్తున్నారు. అందుకు ఉదాహరణే రఫెల్ కుంభకోణం. మొదట్లో యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న రఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఉన్న ధర కంటే 41 శాతం ఎక్కువ చెల్లిస్తామని మోడీ కొత్త ఒప్పందం చేసుకుని వచ్చారు.

సరే ధర ఎక్కువ చెల్లిస్తున్నారంటే విమానాల నాణ్యతలో తేడా ఏమైనా అంటుందేమో అనుకుంటూ అదేమీ లేదు. పైగా స్వదేశంలో అంబానీకి లబ్ది చేకూరేలా ఒప్పందంలో నిబంధనలు తయారు చేశారు. సరే ఇవన్నీ అయినా నిర్ధిష్ట ప్రక్రియ మేరకు జరిగాయా అంటే అదీ లేదు. మొదట్లో కాంగ్రెస్ చేసిన ఒప్పందాన్ని రద్దు 2015 మార్చి నుండి జూన్ మధ్యలో రద్దు చేసి ఆ తర్వాత కొత్త ఒప్పందమే చేసుకొచ్చామని మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ రద్దు విషయాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదికలో సైతం తెలిపారు. కానీ అందుకు సంబంధించి సమర్పించిన పత్రాలపై తేదీలు, సంతకాలు లేవు.

కానీ ఫ్రెంచ్ సెనేట్ నుండి బయటికొచ్చిన పాత్రల్లో మాత్రం మోడీ పాత ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే 36 విమానాలను ఆధిక ధరకు కొనుగోలు చేసేలా కొత్త ఒప్పందాన్ని చేసుకోచ్చారనే విషయం బయటపడింది. అంతేకాదు ఈ ఒప్పందానికి సంబందించిన చర్చల్లో ప్రధాని కార్యాలయం జోక్యం ఉండకూడదు. కానీ అందుకు విరుద్దంగా ప్రధాని కార్యాలయం సమాంతర చర్చల్లో జోక్యం చేసుకుందని తేలింది. దీన్నిబట్టి రాఫెల్ డీల్ మోడీ మాయ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.