కొత్త ప‌ద్ధతుల్లో కేసీఆర్ స‌ర్కార్ బ‌డ్జెట్

Saturday, September 13th, 2014, 04:52:17 PM IST


బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ సర్కార్ కసరత్తు మమ్మరం చేసింది.అందుకోసం ఏర్పాటు చేసిన 14 టాస్క్ పోర్స్ కమిటీ లు ప్రతిపాదనలు చేసినా.. సీఎం కేసీఆర్ మరికొన్ని మార్పు చేర్పులు చేయాలని సూచించారు. ఈనెల 30 లోగా నివేదిక అందించాలని ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మరోవైపు కర్ణాటక తరహాలో.. ప్రతీ 5కోట్ల నిధుల కేటాయింపునకు సంబంధించి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త రాష్ట్రంలో తొలి బడ్జెట్ ను టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల హామీలు.. మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈనెపథ్యంలో ఆర్థిక శాఖ తయారు చేసిన ప్రతిపాధనలో మార్పు చేర్పులు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆలస్యమవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో పారదర్శకత ఉండాలని 14 టాస్క్ ఫోర్స్ కమిటీలను సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఇప్పటికే అనేక సార్లు బేటీ అయ్యాయి. ఈనెల 5వ తేదీనే రిపోర్ట్స్ ప్రభుత్వానికి కమిటీలు అందిచాల్సి ఉంది. ఇటీవలే స‌చివాల‌యంలో ప్రభుత్వ సలహాదారులు, అన్ని శాఖల ముఖ్య కార్యద‌ర్శులతో సీఎం స‌మావేశాన్ని నిర్వహించారు.

బ‌డ్జెట్ త‌యారీపై అధికారుల‌కు దిశానిర్ధేశం చేశారు. బ‌డ్జెట్ త‌యారీ మూస ప‌ద్ధతిలో కాకుండా…నూత‌న ఒర‌వ‌డిలో సాగాల‌న్నారు. శాఖ‌ల వారీగా విధానాలను త‌యారు చేసి.. వాటిపై క్షుణ్ణంగా చ‌ర్చించి బ‌డ్జెట్ కేటాయించాలని సూచించారు. తెలంగాణ‌కు ఉన్న వ‌న‌రులేంటి.. ఇక్కడ అవ‌స‌రాలేంటి, తెలంగాణ ప్రాధాన్యాలేంటి.. తెలంగాణ‌కు ఉన్న అనుకూల‌త‌లు, ప్రతికూలతల ప్రాతిపదికన బడ్జెట్ ను రూపొందించాల‌ని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

అయితే కొన్ని శాఖలకు చెందిన 5 కమిటీలు మాత్రమే తుది నివేదికలను ఇప్పటి వరకూ సమర్పించాయి. మరికొన్ని కమిటీలు తమ తుది నివేదికలను సమర్పించలేదు. దీంతో.. సీఎస్ రాజీవ్ శర్మ ఈ నెల 30వ తేదీలోపు అన్ని కమిటీలు తమ తుది నివేదికలను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.

ఈనెల చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావించారు. కానీ టాస్క్ పోర్స్ ల కమిటీలు తుది నివేదికలు అందించాడనికి ఈనెల 30వవరకూ గడువు ఇవ్వడంతో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల ఆరు నుంచి జరిగే అవకాశం ఉంది.. మొత్తంగా గ‌తానికి భిన్నంగా కొత్త ప‌ద్ధతుల్లో కేసీఆర్ స‌ర్కార్ రూపొందిస్తున్న బ‌డ్జెట్ ఎంత మేర ప్రజల‌ను మెప్పిస్తుందో చూడాలి.