ఎగిరే కార్లు కాదు..ఎగిరే బైక్స్ వస్తున్నాయ్..!

Sunday, November 18th, 2018, 06:26:24 PM IST

రోజులు మారుతున్న కొద్దీ ప్రపంచంలో టెక్నాలజీ కూడా ఇంకా వేగంగా మారుతుంది.ఇప్పటికే మానవుడు తన మేధాశక్తితో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించాడు.మనం మన చిన్న వయసులోనే ఎగిరే కార్లు మన భవిష్యత్తులో రాబోతున్నాయి అని వార్తలు విన్నాము.అవి ఇప్పటి వరకు రాలేదు కానీ వాటి కన్నా ముందే గాల్లో ఎగిరే బైక్స్ మాత్రం అతి త్వరలోనే రాబోతున్నాయి.ఇది మాత్రం నిజమే,ఎందుకంటే ఇప్పటికే వీటి మీద పరిశోధనలు కూడా జరిగి పరీక్ష దశలో ఉన్నాయి.

ఏఐ(ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) సాయంతో,కంప్యూటర్ పరిజ్ఞ్యానం తో దుబాయ్ పోలీసులు ఈ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు.అక్కడి పోలీసులకు ఇప్పుడు వాటిని ఎలా నడపాలి అన్న దాని మీద శిక్షణ కూడా ఇస్తున్నారు.ఇవి చూడడానికి “డ్రోన్స్” లా ఉంటాయి.కాకపోతే ఒక మనిషిని సైతం గాలిలోకి లేపి తీసుకెళ్లగలిగే సామర్ధ్యంతో వీటిని రూపొందిస్తున్నారు.ఇవి సుమారు 16 అడుగుల ఎత్తులో గంటకు 60 మైళ్ళ వేగంతో వెళ్తాయని తెలుస్తుంది.వీటినే “హోవర్ బైక్స్” అని అంటారు.ఇవి 2020 వ సంవత్సరంలో పూర్తి స్థాయిలో అక్కడ అందుబాటులోకి రానున్నాయి.