రెండు గేర్ బాక్సులతో మార్కెట్ లోకి టయోటా కొత్త హై స్పీడ్ కారు…

Tuesday, March 13th, 2018, 01:00:56 AM IST

మారుతున్న కాలానికి అనుగుణంగా కార్లు కూడా మారుతున్నాయి. ఇటివల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రయ్‌ రయ్‌మంటూ యమ స్పీడ్‌గా దూసుకుపోతున్న టొయోటా సరికొత్త కారును మార్కెట్‌లోకి తీసుకురానుంది. యారిస్‌ పేరుతో రాబోతున్న ఈ కారు బుకింగ్స్ వచ్చే నెలలో ప్రారంభిస్తామని, మే నెల నెలలో ఈ కారు రోడ్డెక్కనుందని పేర్కొన్నారు సంస్థ అధికారులు. రెండు గేర్ బాక్సులు (6- స్పీడ్‌ మాన్‌వల్‌ లేదా 7- స్ఫీడ్‌ సీవీటీ ఆటోమేటిక్‌), ఏకంగా 7 ఎయిర్ బ్యాగ్స్‌తో తయారుచేయబడిన ఈ కార్ ధర కేవలం 10 నుంచి 12 లక్షలుగా ఉండనుందట. మా సంస్థ నుంచి వస్తున్న ఈ యారీస్ కారు హోండా సిటీ, హ్యూందాయ్‌ వారి వెర్నా, మారుతీ సుజుకీ సియాజ్‌ కార్లకు పోటీ ఇవ్వనుందని అంటోంది టొయోటా యాజమాన్యం. ఇక కారు షోరూంలోకి దిగాక చూడాలి ఎన్ని కంపినీలకి ఎంత పోటీనిస్తుందో, అంత మంది చేతిలోకి వస్తుందో అని.