హైదరాబాద్ లో ట్రాఫిక్ కొత్త రూల్స్ .. అలా తోలితే జైల్లో పెడతాం

Tuesday, September 27th, 2016, 10:00:06 PM IST

trafic
ట్రాఫిక్ నగరంగా హైదరాబాద్ కి విపరీతమైన పేరుంది. ట్రాఫిక్ లో అడుగు పెడితే ఇంటికి వెనక్కి ఒచ్చేది చెప్పడం కష్టమైన విషయం. ఇక మొన్న పడిన వర్షాల దెబ్బకి రోడ్ ల మీద అవస్థలు అంతా ఇంతా కాదు. వానలు, గాలి , రోడ్ ల నిండా గోతులు. ఒక్క కుకట్పల్లి లోపల నుంచి మియాపూర్ రోడ్డు వరకూ వెళ్ళాలి అంటే రెండు గంటల పాటు పట్టిన రోజులు ఉన్నాయి. ఇదంతా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి వల్లనే అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది. కొత్త రూల్స్ ని ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా వాహనం తోలితే ఫైన్ లతో ముంచెత్తేస్తారు కూడా. తెలంగాణా ప్రభుత్వం ఈ విషయం లో జీవో కూడా జారీ చేసి మరీ వాహనదారుల పని పట్టబోతోంది. పాయింట్ ల రూపం లో పెనాల్టీ లు వేస్తారు. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తే అతనికి రెండు రెండు పాయింట్ ల చొప్పున ఇచ్చుకుంటూ వెళతారు. ఆ వివరాలు తమదగ్గర ఐపాడ్ లో నోట్ చేసుకుంటారు పోలీసులు 12 పాయింట్ లు దాటిన వ్యక్తికి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష వేస్తూ లైసెన్స్ ని కూడా క్యాన్సిల్ చేసి పారేస్తారు. ఈ వివరాలు ట్రాఫిక్ చీఫ్ జితేందర్ పేర్కొన్నారు.