జయలలిత డీఎన్‌ఏ కేసులో మరో ట్విస్ట్!

Friday, April 27th, 2018, 04:40:54 PM IST

జయలలిత మరణించి ఏడాది పూర్తయినా ఇంకా ఆమెకు సంబందించిన ఎదో విషయం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఆమెకు కూతురు ఉన్నారనే విషయం గత ఏడాది నుంచి వార్తల్లో వినిపిస్తోన్న అంశం. జయలలిత పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆమె నటుడు శోభన్ బాబుతో రిలేషన్ ని మెయింటేన్ చేశారని ఆమె సన్నిహితులే మొదటి నుంచి ఆరోపిస్తుండం చర్చనీయాంశంగా మారింది.

అమృతం అనే ఒక మహిళ కూడా తెరపైకి వచ్చి తానే జయలలిత అసలు కూతురునని చెప్పి కావాలంటే డిఎన్ఏ టెస్ట్ ని కూడా చేసుకోవాలని మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా.. 2016లో ఆస్పత్రిలో చేరినప్పుడు జయకు సంబంధించిన బయోలాజికల్‌ నమూనాలు ఏవైనా సేకరించి ఉంచారా? అని కోర్టు ఆస్పత్రిని కోరింది. దీంతో యాజమాన్యం అలాంటివేమీ లేవని సమాధానం ఇవ్వడంతో కోర్టు కేసును తిరస్కరించి హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సమాధానం ఇచ్చింది. దీంతో అమృత అనే మహిళ మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.