పవన్ అభిమాని అనీల్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు..!

Thursday, September 6th, 2018, 10:36:36 AM IST

గత కొద్ది రోజుల క్రితం విజయవాడకి చెందిన అనిల్ కుమార్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని తీవ్ర మనస్తాపం తో తన స్వగృహం లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసినదే. తాను చనిపోయిన తర్వాత తన అభిమాన హీరో ఐన పవన్ కళ్యాణ్ గారి చేతులు మీదగా అంత్య క్రియలు జరిపించాలని ఒక లేఖ వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నారు అని కూడా తెలిసిన విషయమే ఐతే ఇప్పుడు ఈ సమస్యలో కొత్త మలుపు తిరిగింది.

అది ఏమిటంటే ఆ రోజు మృతుడు అనీల్ కుమార్ ఒక్క లేఖ కాదని రెండు ఆత్మ హత్య లేఖలు వ్రాసి చనిపోయాడని తెలుస్తున్నది ఒక లేఖలో తన కుటుంబం కోసం వ్రాసాడని మరో లేఖలో పవన్ కళ్యాణ్ తన అంత్య క్రియలకు రావాలని రాసి అందులో సంతకం చేసి వేలి ముద్ర కూడా చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఆ లేఖలో సంతకం తో పాటు వేలి ముద్ర ఎందుకు వేసాడు అన్నా దానిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి, అని కేసుని దర్యాప్తు చేసిన పోలీసులు అంటున్నారు. ఇది ఇలా ఉండగా అనీల్ యొక్క తల్లితండ్రులు తన కుమారుని సమాధి మీద పవన్ కళ్యాణ్ గారి చేత ఒక పిడికెడు మట్టి వేస్తే చాలని వారి కుమారుడి ఆత్మ శాంతిస్తుందని వ్యక్తపరిచి కన్నీరు మున్నీరు అవుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments