మరో సైబర్ బాంబ్..నిలిచిపోయిన ఆన్లైన్ సేవలు..!

Wednesday, October 25th, 2017, 11:52:45 PM IST

ప్రపంచ దేశాలనే వానక్రై వైరస్ వణికించిన విషయం తెలిసిందే. భారత్ తో సహా అనేక ప్రపంచ దేశాలలో వ్యాపించిన ఈ వైరస్ వలన ఆన్లైన్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లండన్ లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. కాగా తాజాగా మరో వైరస్ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇదే తరహాలో గతేడాది పెత్యా వైరస్ తో హ్యాకర్లు రెచ్చిపోయారు. మరో మారు ఆన్లైన్ సేవల్ని స్తంభింప జేసేందుకు ఈ వైరస్ నే ఉపయోగించునట్లు తెలుస్తోంది.

దీనిప్రభావంతో రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పలు ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రెండు దేశాల్లో వైరస్ ప్రభావంతో విమాన యాన సేవలకు, ఆసుపత్రుల్లో విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ రెండు దేశాల నుంచి వైరస్ జర్మనీ, టర్కీ లకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. కానీ వైరస్ ప్రభావం ఆందోళనకరంగా మాత్రం లేదని అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments