కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్.. ఎంతగా అంటే యువతి అశ్లీలంగా మారేంతగా..!

Tuesday, November 15th, 2016, 07:13:17 PM IST

lady
ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులకు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి.మోడీ చర్యని పలువురు అభినందిస్తున్నా, నరకం చూస్తున్న సామాన్యులు మాత్రం పెద్దఎత్తున మోడీ పై విమర్శలు చేస్తున్నారు. దీనిప్రభావం తో కొందరు అసహనానికి లోనవుతున్నారు. గుండె పోటుతో మరణించిన వారుకూడా ఉన్నారు. దేశరాజధాని ఢిల్లీలో బ్యాంకు వద్ద గంటల తరబడి క్యూలో నిలబడిన ఓ యువతి సహనం కోల్పోయింది.దీనితో అర్థనగ్నంగా నిలబడి అందరిని ఆశ్చర్య పరిచింది.గట్టిగా అరుస్తూ ప్రభుత్వం పై తన నిరసనని వ్యక్తం చేసింది.

దీనితో అక్కడున్న మహిళలు ఆమెని వారించే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు.దీనితో పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడుకు చేరుకున్నారు. క్యూలో ఉన్న వారితో సంభందం లేకుండా ఆమెకు డబ్బులిచ్చి పంపాలని మహిళా పోలీస్ లు బ్యాంకు అధికారులను కోరడంతో ఆమె కు డబ్బులు ఇచ్చి పంపారు. కాగా కొందరు ఆమె మహిళా కాదని హిజ్రా అని అభిప్రాయం పడుతున్నారు. అక్కడున్న మహిళలు మాత్రం ఆమె మహిళే అని స్ఫష్టం చేశారు.ఇలాంటి చర్య సమర్థనీయం కాకపోయినా దేశంలో ప్రజల్లో అసహనం పెరిగి పోతుందనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి ఘటనలు ఢిల్లీ లో తరచుగా జరుగుతున్నాయి. కొందరు యువతులు మద్యం మత్తులో కూడా ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.