అంజలికి ఇదే చివరి చాన్స్

Monday, July 8th, 2013, 06:00:35 PM IST


గతంలో అంజలి చేసిన వ్యాక్యలపై తమిళ దర్శకుడు కళంజియం సైదా పేట కోర్టులో కేసు దాఖలు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు అంజలిని సైదా పేట కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశించిది. అయితే పలు కారణాల వల్ల మొదట ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దానితో మరిసారి అనగా జూలై 8న హాజరు కావలిసిందిగా కోర్టు ఆదేశించిది. అయిన ఈరోజు కూడా ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో సైదా పేట కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు మరిసారి కూడా అవకాశాన్ని ఇస్తూ విచారణకు ఈ నెల 12న హాజరు కావలసిందిగా ఆదేశించింది. ఈ సారి తప్పకుండ కోర్టుకు హాజరు కావలి. ఒకవేళ ఈ సారి గనుక కోర్టులో విచారణకు హాజరు కాకపొతే అరెస్ట్ వారెంట్ జారి చెయ్యవలసి వస్తునదని సైదా కోర్టు న్యాయమూర్తి అంజలిని హెచ్చరించారు.