ఇండియన్ టీంకి మరో దెబ్బ

Thursday, July 4th, 2013, 08:35:39 PM IST


చాపియన్స్ ట్రోపీ కైవసం చేసుకొని మేమే టాప్ అని చెప్పుకుంటున్న టీం ఇండియాకి ఆ ఆనందం కొద్ది రోజులైనా లేకుండానే పోయింది. దీనికి కారణం కరేబియన్ దీవుల్లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సీరీస్. ఇప్పటికే ఇండియా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఇండియా ఓటమి పాలై తదుపరి మ్యాచ్ అన్నా గెలుస్తామా లేదా అన్న సంకటంలో పడి కొట్టు కుంటున్న సమయంలో టీం ఇండియా ఆటగాళ్లకి జరిమానా రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. మొన్న జరిగిన శ్రీ లంక – ఇండియా మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ జరిమానా విధించారు. బోర్డ్ ఇచ్చిన నిర్ణీత సమయానికి ఓవర్ తక్కువగా వేయడంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రొవే ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5.1 ను ఉల్లంఘించారని భావించి భారత్ యువ జట్టుకి ఫైన్ వేసారు. ఈ జరిమానాలో భాగంగా కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20%, మిగతా టీం ప్లేయర్స్ ఫీజులో నుంచి 10% కట్ చేస్తారు. ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న టీం ఇండియా ఇక నుంచి అన్నా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది .