దక్షిణ సినీ వేడుకలకు రానున్న రాష్ట్రపతి

Saturday, July 20th, 2013, 12:16:06 AM IST


భారతీయ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దక్షిణ భారత చలన చిత్ర మండలి అద్వర్యంలో వేడుకని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఒకటవ తేది నుండి ప్రారంభం కానున్న ఈ వేడుకకు రావడానికి మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అంగీకరించడం జరిగింది. దక్షిణ భారత దేశంలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా పరిశ్రమలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఘనంగా ఈ విడుకలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగావారు గురువారం సీపీఐ ఎండీ డీ. రాజా ఆద్వర్యంలో అద్యక్షుడు సి. కళ్యాణ్, కార్యదర్శులు ఎల్. సురేష్, రవి కొట్టార్కర మొదలగువారు రాష్ట్రపతి నివాసానికి వెళ్లి ఆయనను కలిసి వేడుకలకు ఆహ్వానించడం జరిగింది.