స్టూడెంట్ బస్ పాస్ ధరలు పెంచిన ఆర్టీసీ

Thursday, June 6th, 2013, 10:51:01 PM IST


దాదాపు 10 సంవత్సరాల తరువాత ఆర్టీసీ విద్యార్థులు బస్ పాస్ ధరలను 60% మేర పెంచింది. అనగా రూ. 85 గల జనరల్ బస్ పాస్ రూ. 130 లకు పెంచింది. అలాగే త్రైమాసిక పాస్ రూ. 240 నుండి రూ. 390 వరకు పెంచడం జరిగింది. ఈ పెరిగిన ధరలు ఈ నెల 10వ తేది నుండి అమలుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ ఫీజులను పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్న విద్యార్థులపై ఆర్టీసి కూడా ఇప్పుడు మరోభారాన్ని మోపింది. 11 సంవత్సరాల క్రితం పెచ్చిన బస్ పాస్ ధరలను ఇప్పుడు పెంచక తపడంలేదని ఆర్టీసీ వారు చెబుతున్నారు. ఈ బస్ పాస్ ల పెంపు పాపం ప్రభుత్వానిదేనని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బస్ పాస్ రాయితిలకోసం 2013 -14 సంవత్సరానికి గాను రూ. 200 కోట్లను కేటాయించింది. కానీ ఇప్పటి వరకు దాదాపు 50% నిదులను మాత్రమే కేటాయించిందని వారు అన్నారు. దీనికి తోడూ ఏక మొత్తంగా డీజిల్ కొనుగోలు చేసే ఆర్టీసీకి ప్రభుత్వం రాయితీని ఇవ్వకపోవడంతో ఆర్టీసీ పై అదనంగా మరో రూ. 780కోట్ల భారం పడుతుందని అన్నారు. ఇప్పటికే రుణాలు, నిర్వహణ సష్టలతో కలిపి దాదాపు రూ. 4000 కోట్ల నష్టాలలో వున్నా ఆర్టీసీ విద్యార్థులు బస్ పాస్ ధరలు పెంచక తప్పడం లేదనివారు చెబుతున్నారు.