V6 న్యూస్ రీడర్ ఆత్మహత్య.. బయటపడ్డ సూసైడ్ నోట్!

Monday, April 2nd, 2018, 12:24:40 PM IST

హైదరాబాదా లోని మూసాపేట్ లో న్యూస్ ఛానల్ కి చెందిన ఉద్యోగిని ఆత్మహత్య సంచలనం సృష్టించింది. తన చావుకు ఎవరు కారణం కాదు అనే విధంగా లెటర్ రాసి ఆమె తీసుకున్న నిర్ణయం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా ప్రముఖ v6 న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పని చేస్తోన్న రాధిక (30) హైదరాబాద్‌లోని మూసాపేట్ లో ఉంటోంది. గూడ్స్‌షెడ్‌ రోడ్డులోని సువీలా అపార్ట్‌మెంట్‌లో తన తండ్రి, చెల్లెలు, కుమారుడితో ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్న రాధికా ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

అయితే ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చిన ఆమె నిరాశతో అపార్ట్మెంట్ పైకి వెళ్లడం సన్నిహితులు గమనించారు. అయితే పైకి వెళ్లి చూస్తే ఆమె కనిపించలేదు. అప్పటికే రాధిక కిందకు దూకేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు పెట్టారు. అయితే ఆమె బ్యాగులో సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను..’ అంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. అయితే ఆమె భర్త దూరమవ్వడం తట్టుకోలేక చాలా కాలంగా మానసికంగా ఆవేదనకు గురవుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments