కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్ : బిజెపి నేత

Thursday, May 3rd, 2018, 04:21:24 PM IST

గత ఎన్నికల్లో కేంద్ర ఎన్డీయే లోని బిజెపి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న టీడిపి, కొద్దిరోజుల క్రితం ఆ మైత్రిని తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకముందు కొద్దిరోజుల నుండి ఏపీ బిజేపినేతలు విష్ణు కుమార్ రాజు, సోము వీర్రాజులు కొన్ని విమర్శలు టీడీపీ పై చేసిన విషయం తెలిసిందే. ఇంకా ప్రస్తుతం వారితో తెగతెంపులు అయ్యాక విమర్శల దాడిని మరించ పెంచినట్లు త్లెలుస్తోంది. కాగా నేడు తిరుమల విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విష్ణుకుమార్ రాజు అక్కడ మీడియా తో మాట్లాడారు.

అంతే కాదు రానున్న ఎన్నికలపై కొన్ని సంచలన కామెంట్ లు చేశారు. ఏపీ లో చంద్రబాబు గ్రాఫ్ చాలావరకు పడిపోయిందని, ఇక రానున్న రోజుల్లో అది పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని సంచలన కామెంట్ లు చేశారు. ఓటుకు నోటు కేసు లో దొరికిపోయి ఇంకా దొరికిపోతామనే భయంతోనే ఉన్నట్లుండి చంద్రబాబు తన మకాంని హైదరాబాద్ నుండి విజయవాడ కి మరచారు అని అన్నారు. మొన్నటివరకు బిజెపిని, మోడీని పొగిడిన బాబు, ఇప్పుడెందుకు తిడుతున్నారో వారికే తెలియాలని అన్నారు.

కేంద్రం వారు చెప్పిన విధంగా స్పెషల్ ప్యాకేజి ప్రకారం ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారని, కానీ టిడిపి నేతలు మాత్రం లబ్ది పొంది, ఆ తర్వాత లేదని చెప్పడం వారి విజ్ఞతకే తెలియాలని అన్నారు. కర్ణాటకలో అక్కడి తెలుగువారికి కూడా బిజెపి కి వోటెయ్యొద్దని బాబు అంటున్నారు, నిజానికి ఆ మాట వారి చుట్టాలకు చెప్పాలని చమత్కరించారు. నిజానికి ఆయన మాటలతో కర్ణాటకలోని తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. త్వరలోనే టిడిపి పూర్తి నిజస్వరూపం బయటపెడతానని, ప్రజలు అన్నీ చూస్తూనే వున్నారని అన్నారు…….

Comments