హీరోయిన్ గా అక్సా ఖానా..?డైరెక్టర్ గా ఆది.!

Thursday, March 7th, 2019, 11:00:40 PM IST

అక్సా ఖాన్ హీరోయిన్ గా హైపర్ ఆది డైరెక్షన్ లో నిజంగా సినిమా చేస్తుంది అనుకుంటున్నారా?కాదండి బాబు వచ్చే వారం జబర్దస్త్ లో వీరు చెయ్యబోయే స్కిట్ అది.హైపర్ ఆది ఈ సారి డైరెక్టర్ గా మారి తన సినిమాలో హీరోయిన్ గా లాస్ట్ సీజన్ “ఢీ” సెన్సేషన్ అక్సా ఖాన్ ను దింపేశారు.అక్సాకి హీరోగా రైజింగ్ రాజుని పెట్టేసారు.ఇక సినిమా అంటే డాన్సులు తప్పనిసరి ఆది ఏమో రాజు గారిని అక్సా ఎలా చేస్తే అలా అచ్చు దింపేయమన్నారు..అంతే అక్సా స్టెప్పులు చూసి రాజు గారి మైండ్ బ్లాక్..మనకేమో బోల్డంత ఫన్.

యావత్తు తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే “జబర్దస్త్” ప్రోగ్రాం వచ్చే వారం ప్రోమో ఇప్పుడే విడుదలైంది.ఎంటెర్టైమెంట్ ఇవ్వడంలో వీరిని కొట్టే వాళ్ళు లేరని వీరు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు.కానీ ఈ సారి అంతకు మించే ఉండబోతున్నట్టు అనిపిస్తుంది.చలాకీ చంటి భాస్కర్ మరియు సుధాకర్ ఈ కాంబినేషన్ లో చంటి బయోపిక్ పై స్కిట్ చేస్తున్నారు.భాస్కర్ మరియు సుధాకర్ లు చంటి దగ్గరకు ఎలా వచ్చారు.?వెన్నుపోటు పొడిచి వీరెలా టీమ్ లీడర్లుగా ఎదిగారు?మళ్ళీ చంటి వచ్చాక అతని దగ్గర చూపించిన అతి వినయం కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.

ఇక రాకెట్ రాఘవ మరోసారి మాటలు లేకుండా ఒక ప్రోఫిసినెల్ కిల్లర్ గా నవ్వులు పూయించారు.రాకింగ్ రాకేష్ తన చిచ్చర పిడుగుల గ్యాంగ్ తో చేసిన స్కిట్ అలాగే అదిరే అభి మరియు నవీన్ ల మధ్య జరిగే సంభాషణలు కూడా హిలేరియస్ గా పేలాయి.మెగా బ్రదర్ నాగబాబు, ప్రముఖ సినీ నటి మరియు ఎమ్మెల్యే రోజా ఈ షో కి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ పూర్తి ఎపిసోడ్ వచ్చే గురువారం 14 వ తేదీన రాత్రి 9:30 నిమిషాలకు మీ ఈటీవీలో ప్రసారం కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి