జబర్దస్త్ లోకి ప్రదీప్ ఎంట్రీ..అక్కడా వదలని పెళ్లి గోల.!

Thursday, March 14th, 2019, 08:21:00 PM IST

వచ్చే గురువారం టెలికాస్ట్ కాబోయే “జబర్దస్త్” ఎపిసోడ్ తాలూకా ప్రోమో ఇప్పుడే విడుదలయ్యింది.నిరంతరం ఎంటెర్టైనేమేంట్ ఇవ్వడంలో ఈటీవీ ఎప్పుడూ ముందే ఉంటుంది.అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు విడుదలైన ప్రోమో కూడా ఉంది.తనదైన పంచులతో నవ్వించే “హైపర్ ఆది” ఈసారి తన టీమ్ తో పాటు యూత్ ఐకాన్ “రాకింగ్ యాంకర్” ప్రదీప్ ను జబర్దస్త్ స్టేజ్ పై దింపేశారు.

ఆది,ప్రదీప్ లు అన్నాతమ్ములుగా కారులో ఇచ్చిన ఎంట్రీ పై ఆది పేల్చిన పంచులు,ప్రదీప్ పెళ్లి విషయంలో “భక్తి ఛానల్,స్పోర్ట్స్ ఛానెల్లో తప్ప అన్ని ఛానెల్లో కనబడతావ్ ఇంకా సెటిల్ కాకపోవడం ఏమిటి భయ్యా” అని వేసిన పంచులు చాలా హీలీరియస్ గా వీరిద్దరి మధ్య కామెడీ పండింది.ఇక అలాగే “రాకెట్ రాఘవ” మన రాము పెళ్ళికి మరోసారి ఆర్కెస్ట్రా పెట్టారు.ఈ సరి కాస్త కొత్త రకంగా కుక్కలు పాటలు పాడితే ఎలా ఉంటుందో అలా తన టీమ్ పాడి ఆ పెళ్లి కాస్తా పెటాకులు చేసేలా ఉన్నారు.చలాకి చంటి పంచులు లేని ఆటో డ్రైవర్ గా,రాకింగ్ రాకేష్ పాతకాలపు తరహా స్కిట్ తో మరో సారి కడుపుబ్బా నవ్వించేలా ఉన్నారని ఈ ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది.ఆద్యంతం హాస్యభరితంగా సాగిన ఈ ఫుల్ ఎపిసోడ్ వచ్చే 21 గురువారం రాత్రి 9:30 నిమిషాలకు మీ ఈటీవీలో ప్రసారం కానుంది.